హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలు: ఎంపీడీవో

ELR: గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని ఎంపీడీవో పద్మావతి దేవి అన్నారు. భీమడోలు శాఖ గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఆమె ప్రారంభించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మానవతా జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వర అధ్యక్షత వహించారు. ఎంఈవో-2 భాస్కర్ కుమార్ పాల్గొన్నారు. ప్రతిరోజూ గంటసేపు గ్రంథాలయాన్ని సందర్శించాలని కోరారు.