హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థి అదృశ్యం

PLD: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిర్ణయించిన టీడీపీ నేత బండ్ల నరసింహారావు (రాయుడు) అదృశ్యమయ్యారని కుటుంబ సభ్యులు మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ప్రత్యర్థులే కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల ఆరోపణ చేస్తోంది. ఆయనను వెంటనే గుర్తించాలని కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, గ్రామస్థులు పీఎస్ వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.