హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా బాలల దినోత్సవం

AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రు చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హెచ్ఎం.. ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ.. నెహ్రూకు పిల్లల పట్ల అమితమైన ప్రేమ ఉండేదన్నారు. దీనికి గుర్తుగా ఆయన జయంతి రోజున బాలల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.