హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలినడకన శబరిమలకు అయ్యప్ప భక్తులు

AKP: అచ్యుతాపురం మండలంలోని పెదపాడు గ్రామానికి చెందిన అయ్యప్ప భక్తులు బుదిరెడ్డి నరేంద్ర, జనపరెడ్డి జగదీశ్ శనివారం శబరిమల పాదయాత్ర ప్రారంభించారు. స్వామివారి దర్శనమే లక్ష్యంగా కాలినడకన బయలుదేరిన వీరికి గ్రామంలోని పెదపాడు పీఠం స్వాములు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం గ్రామ పొలిమేర వరకు తోడుగా వెళ్లి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ వీడ్కోలు పలికారు.