హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రం తనిఖీ

CTR: ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ ప్రసాదరావు తెలియజేశారు. పులిచెర్ల మండలం కల్లూరు సచివాలయంలో నామినేషన్ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. నామినేషన్ల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దిశా నిర్దేశం చేశారు.