WGL: గీసుకొండ మండలం గొర్రెకుంటలో చేపల వ్యర్థాలతో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువులు, చేపలతో రూపొందించిన వివిధ రకాల పచ్చళ్ల ప్రదర్శన మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని మహిళా సంఘాల స్టాళ్లను శనివారం పరిశీలించారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఉత్పత్తుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
చేపల వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు, పచ్చళ్ల తయారీ


