NLG: మర్రిగూడ మండలం యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ జాతీయ స్థాయిలో అందించే ఉత్తమ సర్పంచ్ పురస్కారం స్వీకరించేందుకు ఈరోజు ఢిల్లీకి బయలుదేరారు. గ్రామాభివృద్ధి, ప్రజాసేవలో చూపిన చొరవకు గుర్తింపుగా ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తమ గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
జాతీయ ఉత్తమ సర్పంచ్ పురస్కారానికి సంతోష్ ఎంపిక


