హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 16న ప్రత్యేక ప్రజావాణి

NLG: బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈనెల 16న నల్గొండ కలెక్టరేట్‌తో పాటు అన్ని వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చిన్నారుల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ చంద్రశేఖర్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. బాలల హక్కులపై అవగాహన పెంచడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.