హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలు నాటిన చిన్నారులు

NRPT: భారత తొలి ప్రధాని పండిత్ జోహార్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని మరికల్ మండల కేంద్రంలోని నోబుల్ టాలెంట్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో చిన్నారులు మొక్కలను నాటారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ అనిల్ కుమార్, సాదక్, శ్రీజిత్ ఉన్నారు.