హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రమాడులో తాగునీటి సమస్యపై ఆర్డీవో తనిఖీ

NTR: ఎర్రమాడు గ్రామంలో తాగునీటి సమస్యపై పత్రికల్లో వచ్చిన వార్తలకు స్పందించిన ఆర్డీవో ఏ. కుమార్, ఈరోజు గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. బోరు మరమ్మతుకు గురైనప్పటికీ, ప్రత్యామ్నాయంగా మరో ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు వివరించారు. ప్రజలకు నిరంతరం తాగునీరు అందేలా చూడాలని, బోరు సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.