కృష్ణా: స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ దేశ ఆర్థిక అభివృద్ధికి బలమైన పునాది వేశారని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శనివారం అవనిగడ్డలోని గాంధీక్షేత్రంలో గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో నెహ్రు జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి వెంకట్రామ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీక్షేత్రంలో నెహ్రూ జయంతి వేడుకలు


