హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలల గ్రామ సభ

MLG: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లంపల్లి ఎంపీడీవో ఎం.డి. రహముద్దీన్ ఆధ్వర్యంలో, గ్రామ సర్పంచ్ ల్యాద శ్యామ్ రావు నేతృత్వంలో బాలల గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల హక్కులు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, భద్రతపై అవగాహన కల్పించారు. బాలల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. విద్యార్థుల క్రమశిక్షణతో భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు.