హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె’

ములుగు జిల్లా కేంద్రంలో చేపట్టిన NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు చేరింది. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. సమ్మెతో పల్లె దవాఖానాల్లో వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది.