హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డును మట్టిరోడ్డుగా మార్చేశారు!

BHNG: భూదాన్ పోచంపల్లి వెంకటరమణ కాలనీలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పనుల కోసం తవ్విన సీసీ రోడ్డును మట్టితో పూడ్చి వదిలేశారు. సరిగా చదును చేయకపోవడంతో గుంతలు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సీసీ రోడ్డు వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.