హైదరాబాద్: 28°C
తెలంగాణ

జయంతి సభను అడ్డుకుంటే సహించం: కొలిపాక సమ్మయ్య

KNR: హైదరాబాద్‌లో అక్టోబర్ 22న నిర్వహించనున్న పండుగ సాయన్న జయంతి సభను అడ్డుకుంటామని తెలంగాణ ముదిరాజ్ జేఏసీ ప్రకటించడంపై ముదిరాజ్ మహాసభ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు కొలిపాక సమ్మయ్య మండిపడ్డారు. ఈ వైఖరి ముదిరాజ్ సమాజ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. పేదల పక్షాన నిలిచిన పండుగ సాయన్న జయంతిని అడ్డుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.