JGL: NHM వైద్యులు, వివిధ కేడర్ల సిబ్బందికి పీఆర్‌సీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఉద్యోగులు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. వారి సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జిల్లా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందిని కోరారు.
తెలంగాణ
ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి


