SRPT: సూర్యాపేట జిల్లా వైద్యారోగ్య శాఖలో NHM కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్న 5 సెకండ్ ANM,3 ఫార్మసిస్ట్ పోస్టులకు దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు పొడిగించారు. అభ్యర్థులు IDOC కాంప్లెక్స్‌లోని F-25 గదిలో దరఖాస్తులు సమర్పించాలని డీఎంహెచ్‌ఓ వెంకటరమణ సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు.
తెలంగాణ
ANM పోస్టులకు గడువు పొడిగింపు


