హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: నందు నాయక్

MNCL: అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందు నాయక్ అన్నారు. మండలంలోని రోటిగూడ, తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బుధవారం సాయంత్రం ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి నందు నాయక్ కాంగ్రెస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.