MDCL: రాంపల్లి వెంకులోనిగుట్ట ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం విజయదుర్గమ్మ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని కుంకుమ, గాజులను ప్రసాదంగా స్వీకరించారు. భక్తుల నృత్యాలు, పాటల నడుమ అమ్మవారిని పల్లకీలో ఊరేగించడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి.
తెలంగాణ
భక్తులతో కిటకిటలాడిన వెంకులోనిగుట్ట ఆలయం


