KMR: కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో రెండు రోజులుగా వందలాది కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. దసరా రోజు విద్యుత్ వైర్లు, సీసీ కెమెరాల వైర్లు, విలువైన హాలోజన్, డోమ్ లైట్లను పగులగొట్టాయి. కోతుల దాడులతో ఆలయానికి నష్టం వాటిల్లిందని ఆలయ అర్చకులు చెబుతున్నారు. కోతుల బెడదతో ఆలయానికి రావడానికి భక్తులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
అయ్యప్ప ఆలయంలో కోతుల బీభత్సం


