ADB: ఇంద్రవెల్లి మండలం ఓ జిన్నింగ్ ప్రాంగణంలో పేకాట ఆడుతున్న 14 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2,24,100 నగదు, మొబైల్స్, వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి తెలిపారు. స్థలానికి సహకరించిన యజమానిపై కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి


