హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైవేలో రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

NGKL: శ్రీశైలం హైవేపై జేపీ నగర్ సమీపంలోని నక్షత్ర హోటల్ వద్ద రాత్రి 9.30 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో కల్వకుర్తి మండలం కొట్ర గ్రామానికి చెందిన రామోజీ సతీష్ కుమార్ (చింటూ) తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని తొలుత ప్రైవేట్ ఆసుపత్రికి, అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో కొట్ర గ్రామంలో విషాదం నెలకొంది.