హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు: మంత్రి

MLG: ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. రామప్ప చెరువులో 29 అడుగుల నీటినిల్వ ఉందని, పంపింగ్ ద్వారా సరఫరా మెరుగుపరుస్తామని వెల్లడించారు. ఉపాధి హామీతో ఇంకుడుగుంతలు, ఊటకుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మించి ప్రతినీటి చుక్కను ఒడిసిపట్టాలని, తాగునీటికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.