హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి

MDCL: మేడిపల్లిలో రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. చెంగిచర్ల పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పల్సర్ బైక్‌పై వెళ్తున్న నారాయణ్ (20), అభి (20)లను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అభి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.