హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంకు రూ.50 వేల జరిమానా!

ఢిల్లీ విమానాశ్రయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను 3 గంటల పాటు నిర్బంధించినట్లు ఆప్ ఆరోపించింది. అంతేకాకుండా సీఎంకు రూ. 50 వేల వరకు జరిమానా విధించినట్లు చెప్పింది. ఈ ఘటనతో బీజేపీ ప్రభుత్వం సీఎం మాన్‌ను అవమానించినట్లు మండిపడింది. పంజాబీల గౌరవాన్ని, గుర్తింపును దెబ్బతీసే రీతిలో వ్యవహరించిందని ధ్వజమెత్తింది. పారిస్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపింది.