SRCL: గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గర్భిణి షేక్ నస్రీన్‌కు మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో 108 సిబ్బంది అంబులెన్స్‌లోనే ప్రసవం చేశారు. ఈఎంటీ సాయికృష్ణ, పైలట్ మనోజ్ కుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి సురక్షిత ప్రసవానికి సహకరించారు. నస్రీన్ పండంటి మగబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.
తెలంగాణ
అంబులెన్స్‌లో గర్భిణికి ప్రసవం


