MDK: రెడ్డిపల్లి గ్రామంలో పులి సంచరిస్తోందంటూ ప్రచారమైన వార్త అవాస్తవమని సర్పంచ్ నర్సింహా తెలిపారు. పులి ఫొటో నకిలీదని తెలియడంతో రాత్రి భయాందోళనకు గురైన గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి పులి కనిపించిందని ప్రచారం జరిగిన ప్రాంతంలో ఆనవాళ్ల కోసం పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పులి సంచారం వార్తలో వాస్తవం లేదని అధికారులు నిర్ధారించారు.
తెలంగాణ
పులి ఫొటో ఫేక్.. ఊపిరి పీల్చుకున్న గ్రామస్థులు


