హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూ.బాలికల హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు

ASF: జిల్లాలో ఈ నెల 24న జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. ఆసిఫాబాద్‌లోని ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో పోటీలు జరగనున్నట్లు మందమర్రిలో వెల్లడించారు. ఆసక్తి గల క్రీడాకారిణులు శనివారం ఉదయం 9 గంటలకు అవసరమైన ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.