హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుడిసె వాసులకు అండగా ఉంటాం: మాజీ MLA

HNK: వడ్డేపల్లిలోని వైఎస్సార్ నగర్ గుడిసె వాసులకు BRS పార్టీ అండగా ఉంటుందని మాజీ MLA దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. బుధవారం ఆయనను గుడిసె వాసులు కలిసి సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదల భూములను కబ్జా చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అర్హులైన గుడిసెవాసులకు పట్టాలు ఇచ్చి, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.