హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాసరచనలో సత్తా చాటిన పెద్దేముల్ ఎస్సై

VKB: పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ రెండో బహుమతి సాధించారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా చేతుల మీదుగా ఆయన బహుమతిని అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్ధన్‌ను పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది అభినందించారు.