NRPT: నారాయణపేట మండలం పిల్లిగుట్ల తండాలో నెల రోజులుగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని సర్పంచ్ రాథోడ్ సీతమ్మ రాందాస్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి రెండు ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కోరారు.
తెలంగాణ
పిల్లిగుట్ల తండాలో తాగునీటి కష్టాలు


