హైదరాబాద్: 28°C
వార్తలు

జమ్మూకశ్మీర్‌లో లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.