WNP: జూరాల చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేయాలని, ఎండిన పంటలకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని రైతాంగ సమితి అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య డిమాండ్ చేశారు. పెబ్బేరు మండలం రామన్నపేట శివారులో ఎండిపోతున్న పంటలను పరిశీలించి, నీటి కొరతతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారబందీ సాగునీటి విడుదలను మరో రెండు రోజులు పొడిగించాలని కోరారు.
తెలంగాణ
'జూరాల చివరి ఆయకట్టుకు నీరివ్వాలి'


