హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి కలశం వేలం.. రూ.4.52 లక్షల ఆదాయం

VKB: జిల్లాలోని బంట్వరం మండలం యాచారంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో అమ్మవారి కలశాన్ని సామ లక్ష్మారెడ్డి రూ.1,22,000కు దక్కించుకున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కలశం, చీరల వేలం ద్వారా మొత్తం రూ.4,52,500 ఆదాయం సమకూరింది. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.