హైదరాబాద్: 28°C
తెలంగాణ

TRS నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా విక్రాంత్ రెడ్డి

NLG: తెలంగాణ రక్షణ సేన పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా విక్రాంత్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆయనకు ఈరోజు హైదరాబాద్‌లో నియామక ఉత్తర్వులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో అధిష్ఠానం ఈ నియామకం చేపట్టింది. తనపై నమ్మకంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి కల్వకుంట్ల కవితకు విక్రాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.