హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నృత్య ప్రదర్శనతో అలరించిన నివేదిత

SRD: అమీన్‌పూర్‌కు చెందిన క్లాసికల్ డాన్సర్ వడ్ల నివేదిత గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో నిర్వహించిన దసరా సాంస్కృతిక కార్యక్రమాల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. గ్రూప్ డాన్స్‌లో పాల్గొని తన నృత్య నైపుణ్యంతో వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభను చాటుకోవడం అభినందనీయమని పలువురు ప్రశంసించారు.