WNP: పానగల్ మండలంలోని తెల్ల రాళ్లపల్లి తండాలో గిరిజన సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలు, కోలాటాలు, గిరిజన నృత్యాలతో సందడి చేశారు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, హక్కులను కాపాడుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాల్య నాయక్ పిలుపునిచ్చారు.
తెలంగాణ
తెల్ల రాళ్లపల్లి తండాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు


