హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏదుల సర్పంచ్‌కు అవమానంపై నిరసన

WNP: ఏదుల గ్రామ సర్పంచ్ పరుశురాం యాదవ్‌కు సమాచారం ఇవ్వకుండా విజయదశమి సందర్భంగా శమీ పూజ నిర్వహించడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఎంపీడీవో, డీఎల్‌పీవోలు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, సర్పంచ్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.