MBNR: మిడ్జిల్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత ఉత్సవ విగ్రహాలను భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించారు. మండల కేంద్రంతోపాటు వాడియాల, మసి గుండ్లపల్లి, వేముల, వసుపుల, దోనూరు, మల్లాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో దుర్గమ్మ ప్రతిమలను బతుకమ్మ, కోలాటాలతో ఊరేగించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు.
తెలంగాణ
మిడ్జిల్‌లో దుర్గామాత ఉత్సవ విగ్రహాల ఊరేగింపు


