హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సారెస్పీ నీటి విడుదల నిలిపివేత

NRML: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలను నిలిపివేస్తున్నట్లు ఎస్‌ఈ జగదీశ్వర్ తెలిపారు. ఆయకట్టు పంటలను కాపాడేందుకు అక్టోబర్ 10 నుంచి 20 వరకు వివిధ కాలువలు, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా 9 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిన 36 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు స్పష్టం చేశారు.