ADB: బేల మండలంలోని సాంగిడి గ్రామంలో యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. సర్పంచ్ భూపతిరెడ్డి, ఉప సర్పంచ్ జిమ్మ శేఖర్ వీటిని పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల అందజేత


