హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు

BDK: ఇల్లందు మండలంలోని కోట మైసమ్మ ఆలయంలో బుధవారం జాతర వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జాతరతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు బారులు తీరారు.