హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా దుర్గ భవాని శోభాయాత్ర

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో బుధవారం దుర్గ భవాని శోభాయాత్ర వైభవంగా సాగింది. నవరాత్రుల పూజలందుకున్న అమ్మవారిని విజయదశమి వేడుకల అనంతరం గ్రామ వీధుల్లో ఊరేగించారు. మహిళలు, యువతులు భక్తి గీతాలు పాడుతూ వర్కారి సంప్రదాయ నిమజ్జనానికి తరలించారు. జై మల్హర్ యూత్ సభ్యులు భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి వీడ్కోలు పలికారు.