నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు


