MNCL: జన్నారం తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ సిబ్బంది గది శిథిలావస్థకు చేరింది. పట్టణంలోని పలు కాలనీలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన ట్యాంక్ వద్ద సిబ్బంది కోసం గదిని నిర్మించారు. అయితే, సరైన నిర్వహణ లేకపోవడంతో గది క్రమంగా శిథిలమవుతోంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
శిథిలావస్థలో సిబ్బంది గది


