హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రావి ఆకుపై అమరవీరుల స్థూపం

SRD: ఖేడ్ పట్టణానికి చెందిన ప్రముఖ పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ తన కళా నైపుణ్యంతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రావి ఆకుపై అమరవీరుల స్థూపాన్ని అద్భుతంగా చిత్రించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు తన కళ ద్వారా ఘన నివాళులర్పించారు.