హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాడి బిలోలి గ్రామంలో దుర్గామాత శోభాయాత్ర

NZB: రెంజల్ మండలం తాడి బిలోలి గ్రామంలో దుర్గామాత విగ్రహ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో భక్తులు సాంప్రదాయ కార్యక్రమాలతో అమ్మవారి శోభాయాత్ర నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి అభిషేకాల పూజ అనంతరం నిమజ్జనం చేశారు. ఊరేగింపులో మహిళలు, చిన్నారులు, భవానీ మాల ధరించిన వారు పాల్గొన్నారు.