హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం: సజ్జనర్

HYD: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు సీపీ సజ్జనర్ నివాళులర్పించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి త్యాగస్ఫూర్తితో ప్రజాసేవకు నిబద్ధతతో పునరంకితం కావడమే అమరవీరులకు అర్పించే నిజమైన నివాళి అని అన్నారు.