హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్ ప్రమాదం.. కార్మికుడి పరిస్థితి విషమం

RR: చేవెళ్ల మండలం అల్లావాడ గేటు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ ప్రైవేట్ సంస్థ కార్మికుడికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. హెల్మెట్ ధరించి ఉంటే తీవ్ర గాయాల నుంచి తప్పించుకునే అవకాశం ఉండేదని వారు అభిప్రాయపడ్డారు.