హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధిత కుటుంబానికి ఎర్రబెల్లి దయాకర్ పరామర్శ

JN: దేవరుప్పుల మండల మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొల్లూరి సోమయ్య తల్లి లక్ష్మమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం చౌడూరు నివాసానికి చేరుకుని మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సోమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.